విశాఖ మన్యం మైనింగ్ మాఫియాపై మావోయిస్ట్ నేత గణేష్ లేఖ .. వాళ్ళను తరిమికొట్టాలని పిలుపు
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఒక లేఖ ఇప్పుడు విశాఖ మన్యంలో కలకలం రేపింది.
విశాఖ మన్యంలో గత కొంత కాలంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతోంది అని గత కొంత కాలంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ టిడిపి అధికార వైసీపీ పై పోరాటం చేస్తూనే ఉంది. దీనిపై నిత్యం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని వేసి అక్రమ మైనింగ్ పై విచారణ జరిపించాలని, సమగ్ర నివేదికను అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తాజాగా విశాఖ మన్యంలో మైనింగ్ మాఫియా గురించి లేఖ రాసిన మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ మన్యంలో లేటరైట్ ముసుగులో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మన్యం నుంచి మైనింగ్ మాఫియాని తన్ని తరిమేయాలని ఆయన తన లేఖలో సూచించారు. అధికార పార్టీ నాయకులను నిలదీయాలని గణేష్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు వారసులుగా మరో మన్యం పితూరీ కి సిద్ధం కావాలని, మన్యాన్ని కాపాడుకోవాలని గణేష్ పిలుపునిచ్చారు. అంతేకాదు ఆదివాసీల న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బందును విజయవంతం చేయాలని గణేష్ తన లేఖ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.
Recommended Video
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications