ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత నగేష్ హతం
కాకినాడ: ఛత్తీస్గడ్-ఏపీ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలకనేత నగేశ్ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు సోమవారం సాయంత్రం వరకు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు మల్లంపేట ప్రాంతంలో ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మల్లంపేట ప్రాంతమే కాకుండా ఇతరప్రాంతాల్లో కూడా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.

మృతి చెందిన మావోయిస్టును శబరి ఏరియా కమిటీ కమాండర్ నాగేష్గా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ పోలీస్ పార్టీ బలగాలు ఏపీ, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా శబరి ఏరియా కమిటీ తారస పడింది.
దాంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో శబరి ఏరియా కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న నగేష్ హతం కాగా కొంతమంది దళ సభ్యులు పారిపోయినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications