ఎన్‌కౌంటర్ కు నిరసన: 5రాష్ట్రాల బంద్‌కు మావోల పిలుపు
విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 24) జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3న బంద్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 3న బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. 40ఏళ్ల తమ పార్టీ చరిత్రలో సోమవారం నాటి ఎన్‌కౌంటర్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని మావోయిస్టు నేత ప్రతాప్ పేర్కొన్నారు.
ఏఓబీ ఎన్‌కౌంటర్ పూర్తిగా కోవర్ట్ ఆపరేషన్ అని ఆయన ఆరోపించారు. ఏఓబీలో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications