నేటినుండి మావోయిస్ట్ పీఎల్‌జీఏ వారోత్సవాలు; ఏపీ, తెలంగాణా సరిహద్దు జిల్లాల్లో హైటెన్షన్!!
నేటి నుంచి కొనసాగనున్న మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలతో అడవిలో హైటెన్షన్ నెలకొంది. ఏజెన్సీ గ్రామాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారోత్సవాలలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటే ప్రయత్నాలు చేస్తాయని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు.

2000 సంవత్సరం నుండి పీఎల్‌జీఏ వారోత్సవాలు
2000 సంవత్సరం నుండి మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. 1999 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవిలో భద్రతా బలగాల చేతిలో హతమైన ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి హత్యకు వ్యతిరేకంగా పీఎల్‌జీఏ వారోత్సవాలను 2000 సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోల కదలికలపై నిఘా
మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని మండలాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. ఎలైట్ గ్రేహౌండ్స్ ఫోర్స్, ఏపీఎస్పీ, సి ఆర్ పి ఎఫ్ యొక్క అదనపు కంపెనీలు, ఏరియా డామినేషన్ టీమ్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడైనా మావోయిస్టులు పేలుడు పదార్థాలు పెట్టారా అని అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులకు బయటకు రావద్దని హెచ్చరిక
ఇక కీలకమైన ప్రదేశాలలో భద్రతను కూడా పెంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఈ వారం రోజులు బయట తిరగవద్దు అని పోలీసు అధికారులు సూచనలు చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలను కొనసాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనప్పటికీ, ఈ సంవత్సరం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పహారా కాస్తున్నారు.

తెలంగాణాలోనూ అడవి జల్లెడ
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను సైతం జల్లెడ పడుతూ చతిస్గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు పాల్పడవచ్చని అనుమానంతో అప్రమత్తం ఆయన పోలీసులు తనిఖీలు చేస్తూ, హిట్ లిస్ట్ లో ఉన్నవారికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి పనులను నిలిపివేసి, యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు.

ఏజెన్సీలో రాత్రివేళ బస్సులు నిలిపివేసి మరీ నిఘా
మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీ తో పాటుగా చత్తీస్గడ్ అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కదలికలను గమనిస్తూ పోలీసులు వారికి చెక్ పెట్టడానికి ముందుకు సాగుతున్నారు. ఏజెన్సీలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications