ఉత్కంఠకు తెర: కిడ్నాప్‌కు గురైన ముగ్గురు టీడీపీ నేతలు విడుదల

అమరావతి: విశాఖపట్నంలోని ఏజెన్సీలో మంగళవారం కిడ్నాప్‌కు గురైన తెలుగుదేశం పార్టీ సభ్యులను విడుదల చేసినట్టు మావోయిస్టులు కబురు పంపారు. పోలీసు ఇన్ఫార్మర్లన్న అనుమానంతోనే వారిని కిడ్నాప్ చేసినట్టు మావోయిస్టులు తెలిపారు. అయితే వారిని విచారించిన అనంతరం విడుదల చేసినట్టు మావోయిస్టులు వెల్లడించారు.

కాగా, విశాఖపట్టణం జిల్లా ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలంలో అధికార టిడిపికి చెందిన ముగ్గురు నేతలను మావోయిస్టులు సోమవారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. జీకే వీధి మండలంలోని కొత్తగూడం గ్రామానికి చెందిన మామిడి బాలయ్య పడాల్ (45) తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

Maoists released kidnapped 3 TDP Leaders in Vizag District

గూడెం గ్రామానికి చెందిన ముక్కలి మహేష్ (42) జిల్లా కార్యవర్గ సభ్యునిగా, కొత్తూరు గ్రామానికి చెందిన వండలం బాలయ్య(48) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా పని చేస్తున్నాడు. ముగ్గురు టీడీపీ నేతలను విడుదల చేశారని కబురందడంతో వారి కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

మంగళవారం ఉదయం మావోయిస్టులు విడుదల చేసిన ఒక లేఖ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం రంగం దాదాపు సిద్ధం చేసినందున అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురిని అపహరించామని ఎఓబి ప్రత్యేక జోనల్ కమిటీ ఆ లేఖలో పేర్కొంది.

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను విరమించుకుంటున్నట్టు తక్షణం ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని, లేనట్టయితే తెలుగుదేశం నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న పోలీసుల కూంబింగ్‌లు, దాడులు , అరెస్ట్‌లు, క్యాంప్‌లు తక్షణమే నిలిపివేయాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

దీంతో తాము ప్రస్తుతం మావోయిస్టుల చెరలో ఉన్నామని తక్షణమే ప్రభుత్వం స్పందించి బాక్సైట్ తవ్వకాలు జరపబోమంటూ చేసే ప్రకటనపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+