వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, లోకేష్‌పై ఆత్మాహుతి దాడి లేఖపై అనుమానాలు, ఇవీ కారణాలు

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏవోబీలో (ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో) మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను వదలమని వచ్చిన హెచ్చరిక లేఖ పైన అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.

చంద్రబాబు, లోకేష్‌లపై ఆత్మాహుతి దాడికి వెనుకాడం: మావోయిస్ట్ పార్టీ హెచ్చరికఏపీ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి శ్యాం పేరిట ఈ లేఖ విడుదలైంది. ఇది కలకలం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్‌లను వదలమని, అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది నిజమైనది కాకపోవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

లేఖ రాసేందుకు వాడిన లెటర్ హెడ్ నుంచి, అందులో వాడి భాష వరకు మొత్తం మావోయిస్టుల శైలికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధుల సూచనల మేరకు బయట ఉన్న సానుభూతిపరులు ఎవరైనా ఆ లేఖ ఇచ్చారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Chandrababu Naidu

సాధారణంగా మావోయిస్టు పార్టీ ప్రకటన చేస్తే లెటర్ హెడ్ పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) అని ఉంటుందని, ఎడమ వైపున ఎర్ర జెండాపై సుత్తి కొడవలి ఉంటుందని, కానీ తాజా లెటర్ హెడ్ పైన సుత్తి కొడవలి లేదని, మరోవైపు తెలుగులో రాయాల్సి వస్తే భారత మావోయిస్టు పార్ట అని పేర్కొంటారని, కానీ లేఖపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాశారని చెబుతున్నారు.

మావోయిస్టు పార్టీ తన కార్యకర్తలు, మిలిషియా, పిఎల్జీఏను యుద్ధవీరులు, ప్రజా గెరిలాల్లుగా సంభోదిస్తోంది. అయితే ఆ లేఖలో మృతులను నక్సల్స్ అని సంబంధించారు. ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ వెలువడే ప్రకటనల్లో పార్టీ సమావేశం, నేతలకు సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. ఈ లేఖలో అవి లేవు. అలాగే ఆత్మాహుతి దాడి అనే పదాలకు మావోయిస్టు నిఘంటువులో చోటు లేదని అంటున్నారు.

English summary
Maoists threaten to target Chandrababu Naidu, Lokesh: Is that letter fake?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X