వాహనాలకు నిప్పు...విశాఖ జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన మావోలు
విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జీకే వీధి మండలంలో శనివారం ఉదయం మావోయిస్టులు ఓ జేసీబీని దగ్ధం చేశారు. దీంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం పరిధిలో స్థానికంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అందుకోసమే అక్కడ ఉన్న జేసీబీని తగులబెట్టారు. ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు.

పలుసార్లు ఈ విషయమై హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా యథావిథిగా రోడ్డు నిర్మాణం కొనసాగుతుండటం, పైగా భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుపుతుండటాన్ని మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల వద్ద సిబ్బంది లేని సమయం చూసి మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications