మారేడుమిల్లి: జలపాతంలో ఇద్దరు మెడికోల మృతదేహాలు.. మరొకరి కోసం గాలింపు
స్నేహితులతో కలిసి సరదగా ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు ప్లాన్ చేసిన విహార యాత్ర విషాధాన్ని మిగిల్చింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జలపాతం వద్ద గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏలూరు ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 14 మంది విద్యార్థుల బృందం ఆదివారం విహారయాత్రకు బయలుదేరారు.అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే మార్గం మధ్యలో ఉన్న జలతరంగిణి జలపాతం వద్ద సరదాగా గడిపేందుకు దిగారు.

అయితే, హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఐదుగురు విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అదే సమయంలో ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా హరిణిప్రియ, గాయత్రి పుష్పలను ఒడ్డుకు చేర్చారు. అయితే, అప్పటికే హరిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన రాజమండ్రికి తరలించారు.
కొనసాగుతోన్న గాలింపు చర్యలు
గల్లంతైన ముగ్గురు విద్యార్థుల కోసం పోలీసులతోపాటు సీబీఈటీ సిబ్బంది తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో గల్లంతైనవారిలో పార్వతీపురం జిల్లా బొబ్బిలికి చెందిన కొసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి.అమృత (21) మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ (20) కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈరోజు లభ్యమైన సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications