అంత ఈజీ కాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగదు రహిత వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించటం ప్రజలను ఇబ్బందులు పెట్టడానికేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో అక్షరాస్యులు కూడా చాలా తక్కువ మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారని ఆయన తెలిపారు. మన దేశంలో క్యాష్‌ లెస్ వ్యవస్థకు అనుకూల పరిస్థితులు లేవని పలు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. రోజుల తరబడి కరెంటు కోతలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో క్యాష్‌ లెస్ మార్కెట్లు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Marri Shashidhar Reddy says cashless India not to be that easy.
Please Wait while comments are loading...