రేప్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఆపై ఆమెను హత్య చేశాడు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెంలో దారుణ సంఘటన జరిగింది. కర్నూలుకు చెందిన వివాహిత జయ దారుణ హత్యకు గురైంది. కర్నూలుకు చెందిన ఏసు అదే ప్రాంతానికి చెందిన జయపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు జయను ఏసు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఏసు భార్య జయతో కలిసి ఉపాధి కోసం గుంటూరుకు వలస వచ్చాడు. జయను వధిలించుకోదలచిన ఏసు బుధవారంనాడు ఆమె గొంతు నులుమి హత్య చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.

married woman murdered in Guntur district

తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి

కర్నూలు జిల్లాలో కుటుంబ కలహాలతో తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంద్యాల మండలం చాగోలు గ్రామానికి చెందిన ఓ తల్లీ తన కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.

ఈ ఘటనలో తల్లి మరణించగా, కొడుకు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడుకుటుంబకలహాలపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

అన్నదమ్ముల మృతి

కాలు జారీ తమ్ముడు నీటిలో పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో అన్న కూడా మృత్యువాత పడిన ఘటన అనంతపురం జిల్లా పామిడి పెన్నానదిలో జరిగింది. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన మనోజ్‌కుమార్‌(17), ప్రశాం త్‌(15) కుటుంబసభ్యులతో కలిసి పామిడివివాహానికి వచ్చారు.

నదిలో మేనత్త బట్టలు ఉతుకుతుండటాన్ని చూసి అక్కడికి వెళ్లారు. ప్రశాంత్‌ కాలుజారిపడడంతో మనోజ్‌కుమార్‌ తమ్మున్ని రక్షించబోయి తానూ మునిగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+