వివాహితపై అత్యాచారం: పిండ ప్రదానం చేయబోయి...
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కీచకపర్వం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివాహితపై వరుసకు బంధువైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దంపతుల మృతి
నల్లగొండ జిల్లా వేములపల్లిలోని సాగర్ కాల్వలో పడి దంపతులు మరణించారు. పిండప్రదానం చేసేందుకు వచ్చిన దంపతులు సాగర్ ఎడమకాల్వలో గల్లంతయ్యారు. కాల్వలో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. భర్త మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లారీ బోల్తా ముగ్గురి మృతి
ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి
అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్తు తీగలు తగిలి ఓ రైతు మరణించాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రుయ్యూరులో సోమవారం చోటు చేసుకుంది. కావూరి రాజయ్య అనే రైతు సోమవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంపును ఆన్ చేయడానికి బావి వద్దకు వెళ్లాడు. అయితే, అంతకు ముందు రోజు రాత్రి అడవి పందులను నియంత్రించడానికి విద్యుత్తు తీగల విషయం తెలియలేదు. ఆ విద్యుత్తు తీగెలు తగిలి రైతు మరణించాడు.












Click it and Unblock the Notifications