ఆ 'బంగారం'పై 75 శాతం పన్ను: వెంకయ్య షాక్, వెలగపూడి వచ్చాకే.. నోట్ల రద్దుపై బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: బంగారం విషయంలో కేంద్ర ఆర్థిక‌ శాఖ తెలిపిన వివ‌రాలపై కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌ నాయుడు గురువారం స్పందించారు. త‌మ ప్ర‌భుత్వం నల్లకుబేరుల వ‌ద్ద ఉన్న డ‌బ్బు, బంగారంపై ఉక్కుపాదం మోపిందన్నారు.

బంగారంపై కేంద్రంపై దృష్టి: ఇలా ఉంటే పన్ను లేదు, కానీ

కేంద్రం న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి తీసుకున్న పెద్ద‌నోట్ల రద్దు నిర్ణ‌యం అనంత‌రం ర‌ద్దైన నోట్ల‌తో బంగారం కొని నిల్వ చేసుకునే వారి ఆగ‌డాల‌ను కట్టడి చేయడానికి చట్టంలో ప‌లు మార్పులు చేసినట్లు చెప్పారు.

బంగారాన్ని న‌ల్ల‌ధ‌నంతో కాకుండా స‌క్ర‌మంగా కొనుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెప్పారు. వారసత్వం, స్త్రీధనంగా వచ్చిన బంగారం పైన ఎలాంటి నిబంధ‌న‌లు లేవని తెలిపారు. న‌ల్ల‌కుబేరులు లెక్క చూపని బంగారం పైనే 75 శాతం పన్ను ఉంటుందని నల్ల కుబేరులకు షాకిచ్చారు.

venkaiah naidu

వెలగపూడికి వచ్చాకే నోట్ల రద్దు: చంద్రబాబు

వెలగపూడిలో తొలి నిర్ణయంగా 3.5 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని, వెలగపూడి బాగా కలిసి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడకు వచ్చాకే కేంద్రానికి లేఖ రాస్తే పెద్ద నోట్ల రద్దు పైన నిర్ణయం వెలువడిందన్నారు. డ్వాక్రా మహిళలకు మూడో విడత నిధులు విడుదల చేశామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Married Women Allowed 500 Gram Gold, Unmarried Women 250 Gram, Clarifies Government.
Please Wait while comments are loading...