• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి..! మోదీ, చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యార‌న్న కేఏ పాల్..!!

|

విజయవాడ: ఎప్పుడూ సంచ‌ల‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు చేసే ఏకే పాల్ ఈసారి ప్ర‌ధాని మోదీ, ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడును టార్గాట్ చేసారు. ఏపిలో చంద్ర‌బాబు నాయుడు విఫ‌లం చెంద‌డం వ‌ల్ల‌నే అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నాయ‌ని అన్నారు. ఇక మోదీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో అవ‌నీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశానికి ఒరిందేమీ లేద‌ని విమ‌ర్శించారు. రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌జా శాంతి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని పాల్ స్ప‌ష్టం చేసారు.

ఇక ప్ర‌జ‌ల్లోకి ప్ర‌జాశాంతి పార్టీ..! గెలుపై ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌న్న ఏకే పాల్..!!

ఇక ప్ర‌జ‌ల్లోకి ప్ర‌జాశాంతి పార్టీ..! గెలుపై ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌న్న ఏకే పాల్..!!

ప్రజా శాంతి పార్టిని గెలిపిస్తే ఆ నియోజకవర్గానికి 100 కోట్ల విరాళం ఇస్తానని ఆ పార్టీ వ్యవస్థాకులు కేఏ.పాల్ హామీ ఇచ్చారు పాల్ ఆర్మీ సభ్యులంతా గ్రామాలకు‌ వెళ్లి ఒక్కొక్కరు వంద మందిని మా పార్టిలో చేర్పిస్తే తాయిలాలు అందిస్తామన్నారు. వెయ్యి మందిని చేర్పిస్తే మనిషికి రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తి గా రద్దు చేస్తామన్నారు.

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు విఫ‌లం..! అందుకే వెన‌క‌బాటు అంటున్న పాల్..!

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు విఫ‌లం..! అందుకే వెన‌క‌బాటు అంటున్న పాల్..!

రెండేళ్లుగా ప్రజా శాంతి పార్టి భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాలని ప్రణాళికలు తయారు చేస్తుందని ఆయన అన్నారు. సోమవారం విజయవాడలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు కెఏ. పాల్ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధానిగా మారాక విజయవాడ కు తొలిసారిగా వచ్చాననన్నారు. దేవెగౌడ, కపిల్ సిబాల్ పర్యవేక్షణలో సమావేశాలు పెట్టామన్నారు. చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.

రాజ‌కీయాల్లో మార్పు తెస్తాం..! అంద‌రూ ప్ర‌జాశాంతి పార్టీని ఆద‌రించాలంటున్న పాల్..!!

రాజ‌కీయాల్లో మార్పు తెస్తాం..! అంద‌రూ ప్ర‌జాశాంతి పార్టీని ఆద‌రించాలంటున్న పాల్..!!

ఏపీ లో ప్రజా శాంతి పార్టి పోటీ‌చేసేందుకు మూడు ప్రధాన కారణాలున్నాయన్నారు. సేవ్ సెక్యూలర్ ఇండియా, మోదీ ఎన్నికల హామీలను విస్మరించారు, రాష్ట్రంలో చంద్రబాబు పూర్తి గా వైఫల్యం చెందారు. ఈ మూడు కారణాల‌వల్ల మేము దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎంతో మంది తెలుగు‌వాళ్లు రాణిస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. అందులో ఏకె పాల్ ఒక‌రు. రెండు కోట్ల మంది ప్ర‌జ‌లు త‌న‌ను అనుసరిస్తున్నారని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని పాల్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

నిధుల‌కు కొద‌వ‌లేదన్న పాల్..! ప్ర‌జాశాంతి పార్టీని గెలిపించాలి..!

నిధుల‌కు కొద‌వ‌లేదన్న పాల్..! ప్ర‌జాశాంతి పార్టీని గెలిపించాలి..!

దేశంలో అన్ని మతాల వారు భయం గా బతుకుతున్నారని పాల్ చెప్పారు. దేశంలో క్రైస్తవులు, ముస్లింలు అనేక మంది త‌న‌కు మద్దతు పలుకుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఎన్ని అమ‌లు చేశారో అర్థంకావడం లేదన్నారు. ఏపీ లో తాను సేవ చేయని గ్రామం లేదని, ప్రకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చానని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ లు నా గురించి ఎంత గొప్పగా చెప్పారో యూట్యూబ్ లో చూడాల‌ని పాల్ విజ్ఞ‌ప్తి చేసారు.

English summary
Praja santhi party chief AK Paal said two years after he came amaravathi and heplans to save India. On Monday in Vijayawada, praja santhi party founders Paul spoke to the media. Vijayawada, changing as the capital of the AP is the first time. In the history of the abolition of large banknotes, there has been a huge corruption took place in india. pal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X