అనూహ్య మలుపు తిరిగిన ఏపీ లిక్కర్ స్కాం: రూ.3,500 కోట్ల డొంక కదిలే ఛాన్స్
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న నిందితులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. నేటితో వారి రిమాండ్ ముగియనుంది. ఈ పరిస్థితుల మధ్య ఈ లిక్కర్ స్కాంలో ఈడీ ఎంటర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చోటు చేసుకున్నాయి.
మొత్తం 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన లీడ్ దొరికిందని, అందువల్లే ఏకంగా ఈడీ రంగంలోకి దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో మెరుపు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈడీ అధికారులు నకిలీ ఇన్వాయిస్‌లను స్వాధీనంచేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలను పెంచడం వెనుక భారీ స్కాం ఉందనే అనుమానిస్తోన్నట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు సాగుతున్నట్లు సమాచారం.

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్‌కృష్ణలకు కోర్టు గతంలో విధించిన కస్టడీ నేటితో ముగిసింది. దీంతో వారిని ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్ పై విడుదల అయ్యారు.
ఈ కేసు.. తాజాగా శాసన మండలి సమావేశాల్లో చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. బెల్ట్ షాపులు, మద్యం పాలసీ, లిక్కర్ కుంభకోణం, రేట్లు, అమ్మకాలు, రవాణా వంటి అంశాలపై ఆయన బదులిచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని కొల్లు రవీంద్ర అన్నారు.












Click it and Unblock the Notifications