రంగారెడ్డి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలతో 50మంది కార్మికులు ఉక్కిరిబిక్కిరి!!

వేసవికాలం ప్రారంభమైన దగ్గర నుండి అగ్ని ప్రమాద ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి కూకట్పల్లిలో ఒక కూలర్ల షాప్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించి రెండు షాపులు, పదికి పైగా వాహనాలు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగింది కానీ ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఈ ఘటన మరిచిపోక ముందే రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో నేడు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఉన్న ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 50 మంది కార్మికులు పని చేస్తున్నట్టుగా సమాచారం.

massive fire accident in a pharma company in Rangareddy district 50 workers in the company at the time

కిటికీల నుండి దూకేసిన కొందరు కార్మికులు
అయితే అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత కొందరు కార్మికులు కిటికీల లోనుంచి బయటకు దూకి ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమ లోపలే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అగ్ని ప్రమాద ఘటనపై అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

నిచ్చెనల సాయంతో కార్మికులను బయటకు తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది
పరిశ్రమలో చిక్కుకున్న వారిని కూడా నిచ్చెనలు సాయంతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే వాహనాలలో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగుతున్న క్రమంలో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేనివల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది అన్న కోణంలో పరిశేలిస్థున్నాఉ. ఇప్పటివరకు ఎవరికి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాద ఘటనతో ఫార్మా పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+