గ్రౌండ్ ఖాళీ చేయాల్సిందే: సునిత, కిరణ్‌కి ఏరాసు అండ

హైదరాబాద్/మెదక్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. మంత్రి సునితా లక్ష్మా రెడ్డి మెదక్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. ఉద్యమం మొదలైనప్పుడు ఆట ప్రారంభమైందని, సిడబ్ల్యూసి నిర్ణయంతో ముగిసిందన్నారు. ఇప్పుడు గ్రౌండ్ ఖాళీ చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, సీమాంధ్రులు సహకరించాలని ఆమె కోరారు.

ముఖ్యమంత్రికి బ్రహ్మానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి శంకర రావు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తప్పులేదన్న ఏరాసు

ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వేరుగా అన్నారు. రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మరో మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు పది లక్షల మందితో వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామన్నారు.

Sunitha Laxma Reddy

శంకించొద్దు: కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు అనంత వెంకట్రామి రెడ్డి, సాయిప్రతాప్, హర్షకుమార్‌లు పాల్గొన్నారు. సమైక్యాంధ్రపై ఎంపీల చిత్తశుద్ధిని అనుమానించవద్దని, ఉద్యోగులకు ఎంత కమిట్‌మెంట్ ఉందో తమకు అంతే ఉందని హర్ష కుమార్ చెప్పారు.

విభజనతో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం పైన తాము కేంద్రానికి చెప్పామని, బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరామని, పెట్టుబడులు అన్నీ హైదరాబాదుకే వెళ్లాయని, ఉద్యోగాలు కావాలంటే సీమాంధ్రులకు హైదరాబాదే గతి అని తాము వివరించామని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. విభజన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించాలని కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+