ఆంధ్రజ్యోతి, టీవీ9పై టిటిడిపి: భరించాకే.. సాక్షిపై వివరణ
హైదరాబాద్: ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఛానళ్ల పైన న్యాయబద్దంగా, చట్టబద్దంగా వెళ్లే అవకాశం ఉండగా ఎంఎస్‌వోలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం తగదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు టిడిపి ఇచ్చినా వాటిని స్వీకరించకుంటా తెరాస, కెసిఆర్ తమకు పెత్తందారీ, నియంతృత్వ పోకడలను ప్రదర్శించారని ఆరోపించారు. ప్రసార సాధనాల పైన ఒంటెద్దు పోకడలు మంచిదికాదన్నారు. శాసన సభ సమావేశాల్లోని నిర్ణయాలు ప్రజలను నిరాశకు గురి చేశాయని మండిపడ్డారు.

రైతుల రుణమాఫీ, వాహనాల నంబర్లు తదితర అంశాలపై కసరత్తు లేకుండా వారు చేసే ప్రకటనలతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గరువుతున్నారన్నారు.
మరో ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను విమర్శించిన వారిని టార్గెట్ చేయడం ద్వారా కెసిఆర్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై న్యాయబద్దంగా, చట్టబద్దంగా వెళ్లే అవకాశం ఉందన్నారు.
సాక్షి మీడియాను మీరు బరిష్కరించారు కదా అని విలేకరులు ప్రశ్నించగా... ఆ పత్రిక వాస్తవాలను వక్రీకరించిన రాసినా తాము ఏళ్ల తరబడి భరించామని, ఆ తర్వాతే తమ వరకు మాత్రం వద్దని చెప్పామని, అంతేకాగని బహిష్కరించాలని ఎవరికీ చెప్పలేదన్నారు. తాము పార్టీ పరంగా మాత్రమే బహిష్కరించామన్నారు.












Click it and Unblock the Notifications