కాకినాడలో దారుణం: వైద్య విద్యార్థిని ఆత్మహత్య

శ్రీలక్ష్మి విజయనగరంలోని మిమ్స్ కళాశాలలో శ్రీలక్ష్మి ఎంబిబియస్ డిగ్రీ పూర్తి చేసింది. మెరిట్ కోటాలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీటు పొంది రాజమండ్రిలోని జిఎన్ఎస్ వైద్య కళాశాలలో చదువుతోంది. రేడియాలజీ విభాగంలో ఎండి ద్వితీయ సంవత్సరం చేస్తోంది.
ఫీజు చెల్లించకుండా చదువుతుండడాన్ని జీర్ణించుకోలేని కళాశాల యాజమాన్యం, రేడియోలజీ విభాగం వైద్యులు తమ కూతురుని వేధించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారన్నారు. మృతురాలి వద్ద లభించిన మూడు లేఖలను పోలీసులు పరిశీలించారు.
యాజమాన్యం వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీలక్ష్మి లేఖల్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెరిట్ కోటాలో చదువుతున్నందు వల్ల తాము వేధించామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కళాశాల అధ్యాపకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications