ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత వేధించాడు: మెడికో ఆత్మహత్య
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తీవ్రమైన వేధింపులకు గురి చేయడంతో అతని భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వేధింపులను భరించలేక ఆ మహిళ మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం పట్టణానికి చెందిన చంద్ర, లక్ష్మి దంపతుల కూతురు మీనాక్షి బెంగళూరులో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులను కాదని ప్రేమించిన శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. ఆస్తిలో హక్కు లేకుండా రాయించుకుని వారు అమెరికా వెళ్లిపోయారు.

అప్పటి నుంచి మీనాక్షి భర్త శ్రీనివాస్‌తో అనంతపురంలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. క్లాసులు ఉన్నప్పుడు బెంగళూరు వెళ్లి వస్తూ ఉండేది. వీరికి నాలుగు నెలల చిన్నారి ఉంది. తను ఆశించిన ఆస్తి దక్కకపోవడంతో మద్యానికి అలవాటు పడిన శ్రీనివాస్ భార్యను తరుచుగా వేధిస్తూ వచ్చాడు.
సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి మంగళవారం వేకువజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింేది. రాత్రంతా బార్‌లో గడిపిన శ్రీనివాస్ తెల్లవారు జామున ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఆత్మహత్య చేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు.












Click it and Unblock the Notifications