2024లో జనసేన సత్తా చూస్తారు అంటున్న మెగా బ్రదర్ నాగబాబు .. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ నాయకుల్లా కాకుండా మంచి విజన్ తో రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు. తాను చిరంజీవిలా కాదని చెప్పారు. కళ్యాణ్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ మార్చుకోడని నాగబాబు స్పష్టం చేశారు .
Recommended Video


పవన్ జీవితం రాజకీయాలకే అంకితం .. మరోమారు స్పష్టం చేసిన మెగా బ్రదర్
ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర నిరాశాజనక ఫలితాలు లభించడంతో పవన్ రాజకీయాలు వదిలేస్తారని , పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, మెగాబ్రదర్ నాగబాబు అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశారు . వీడియో లైవ్ స్ట్రీమింగ్ లో అభిమానులతో ముచ్చటించిన నాగబాబు, తనకు తెలిసి కళ్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడని చెప్పారు. ఇక రాజకీయాలకే తన జీవితం అంకితం అన్న పవన్ కళ్యాణ్ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే రాజకీయాల్లోనే ఉంటారని స్పష్టం చేశారు.

ఆయన హీరోగా సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే .. పవన్ నిర్ణయం తీసుకుంటే మార్చుకోరన్న నాగబాబు
"కళ్యాణ్ బాబు ఓ సారి తాను సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ అందులోకి రారు. మా అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కళ్యాణ్ బాబు అలా కాదు, సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారు. ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు" అంటూ నాగబాబు చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు మధ్య వ్యత్యాసం చెప్పారు. అయితే, ఇందులో ఓ మినహాయింపు ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా అతిథి పాత్ర చేయమంటే చేసే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు మెగా బ్రదర్. హీరోగా మాత్రం తన సోదరుడి కెరీర్ ముగిసినట్టేనని నాగబాబు తన మాటల్లో వ్యక్తం చేశారు .

2024 ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధిస్తుంది.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం జనసేననే అన్న నాగబాబు
ఇక 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధిస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అన్నారు.వచ్చే ఎన్నికల నాటికి జగన్, చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధి చెందుతుందని నాగబాబు అన్నారు. చాలా మంది ప్రజలు జగన్ కు అవకాశం ఇవ్వాలనుకున్నారని, ఆయన అధికారంలోకి రావడానికి కారణం ఇదేనని అన్నారు. 2024 లో వీరిలో ఎక్కువ మంది జనసేన వైపు మొగ్గు చూపుతారని నా దృష్టికి వచ్చింది. 2024 ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధిస్తుందని ఇది సూచిస్తుంది, అని నాగబాబు పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications