మెగా ఫ్యామిలీకి బంపర్ ఇచ్చిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ముగ్గురు ఎంపీలు ఆ పార్టీతో పాటు, తమ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణా రావు, బీదమస్తాన్‌, ఆర్‌.కృష్ణయ్య రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలు అయిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన మూడు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.

Mega Brother Nagababu in race for Rajya Sabha seat

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగబాబుని ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు.ఈసారి కూటమి తరఫున పోటీ చేసి ఉంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యేవారు. కానీ మూడు పార్టీల సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన్ను రాజ్యసభకు పంపించాలని పవన్ కల్యాణ్‌తో పాటు, చంద్రబాబు సైతం భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.టీడీపీ నుంచి దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు వినిపిస్తోంది. బీజేపీ నుంచి మరో ఎంపీని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+