Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజమండ్రిలో మెగా బ్రదర్స్ పర్యటనలు .. రేపు చిరంజీవి, ఎల్లుండి పవన్ కళ్యాణ్ టూర్, ఫ్యాన్స్ లో జోష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మెగాఫ్యామిలీపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలతో మొదలైన రాజకీయ రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనుండటం ఆసక్తికరంగా మారింది. మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ కు కారణమైంది.

రేపు రాజమండ్రిలో చిరంజీవి పర్యటన

రేపు రాజమండ్రిలో చిరంజీవి పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రోజు మెగాస్టార్ చిరంజీవి పర్యటించనుండగా, శనివారం రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. శుక్రవారం రోజు రాజమండ్రికి రానున్న చిరంజీవి స్థానికంగా కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అల్లు రామయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ చేయనుంది మెగా ఫ్యామిలీ. రాజమండ్రిలో అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాలకు చిరంజీవి రానున్న నేపధ్యంలో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అభిమానులు సన్నద్ధమవుతున్నారు.

గాంధీ జయంతి నాడు పవన్ కళ్యాణ్ పర్యటన

గాంధీ జయంతి నాడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఇక చిరంజీవి పర్యటన శుక్రవారం కొనసాగనుండగా పవన్ కళ్యాణ్ పర్యటన శనివారం రోజు కొనసాగనుంది. అక్టోబరు రెండవ తేదీన రాజమండ్రిలో గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై రోడ్డు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు, ఆయన అభిమానులు. ఈ కార్యక్రమం సజావుగా సాగడం కోసం ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అటు భారీసంఖ్యలో పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ నాయకులు కూడా రోడ్ల శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో రేపు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను నేతలు సిద్ధం చేశారు.

మెగా బ్రదర్స్ పర్యటనలకు పోలీసుల ఏర్పాట్లు .. ఫ్యాన్స్ లో జోష్

మెగా బ్రదర్స్ పర్యటనలకు పోలీసుల ఏర్పాట్లు .. ఫ్యాన్స్ లో జోష్

పోలీసులు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక మొత్తానికి అటు చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్ వరుస పర్యటనల నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు జనసేన పార్టీ నాయకులకు కొత్త ఉత్తేజాన్నిస్తుంది. అటు చిరంజీవి పర్యటనకు, ఇటు పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఏమాత్రం పొంతన లేకపోయినా వరుసగా రెండు రోజుల పాటు వారిద్దరి పర్యటనలు ఉండడంతో ఆసక్తి చోటుచేసుకుంది.

Recommended Video

    Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections || Oneindia Telugu
    పవన్ వర్సెస్ వైసీపీ రగడ .. సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. మెగా బ్రదర్స్ మధ్య గ్యాప్ ?

    పవన్ వర్సెస్ వైసీపీ రగడ .. సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. మెగా బ్రదర్స్ మధ్య గ్యాప్ ?

    ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అటు సినీ ఇండస్ట్రీ, ఇటు రాజకీయ వర్గాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో ఎవరికి తోచిన విధంగా వారు ఉన్న ప్రకటనలు చేస్తుంటే చిరంజీవి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని చిరంజీవి విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరుధ్యాలకు అద్దంపడుతున్నాయి. కనీసం ఒకరికి ఒకరు మెగా సోదరులు మద్దతుగా ఉండడం లేదు అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+