• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్జీవి రచ్చ- మద్దతుగా మెగా హీరో : మంత్రి నాని రివర్స్ అటాక్ - మోహన్ బాబు లేఖపై స్పందనేది..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రచ్ఛన్న యుద్దం ప్రత్యక్షంగా మారుతోంది. ఇప్పటి వరకు పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన టాలీవుడ్ ప్రముులు..ఇప్పుడు డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా సంచలనల దర్శకుడు రాం గోపాల్ వర్మ నేరుగా ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. వాటిని సీఎం జగన్.. మంత్రి పేర్ని నానికి ట్యాగ్ చేసారు. సినిమాతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్‌ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతమేరకు ఉంటుందనే ప్రశ్నతో మొదలు పెట్టి, ప్రభుత్వంలో ఎవరైతే ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్లకి సినిమా రంగంలో పనులు ఎలా జరుగుతున్నాయో, హీరోలకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారనే వివరాలు తెలుసా అంటూ ప్రశ్నించారు.

ఆర్జీవీ ప్రశ్నలపై జోరుగా చర్చ

ఆర్జీవీ ప్రశ్నలపై జోరుగా చర్చ


హీరోలకు ఎంత పారితోషికం ఇవ్వాలనేది వ్యాపార లెక్కల్లో భాగమే తప్ప... ఇంత ఇస్తే చాలు కదా అనడానికి వేరే వాళ్లకి ఎలా హక్కు ఉంటుందంటూ ఆర్జీవి నిలదీసారు. ద్వంద్వ ధరల సిద్ధాంతంలో పరిష్కారం ఉంటుందని, ఇక్కడ నిర్మాతలు వారి ధరలకి టికెట్లను అమ్మవచ్చని, అందులో ప్రభుత్వం కొన్ని టిక్కెట్లను కొనుగోలు చేసి తక్కువ ధరలకు పేదలకు విక్రయించొచ్చని, దాంతో తాము తమ డబ్బును పొందుతామని, మీరు మీ ఓట్లు పొందుతారని సలహా ఇచ్చారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరల్ని నియంత్రిస్తాయని తెలుసని అయితే అది సినిమాలకి ఎలా వర్తిసుందో చెప్పాలని డిమాండ్ చేసారు.

ఇండస్ట్రీ .. పది ప్రశ్నలు

దీనికి ఒక రోజు ముందే చిరంజీవి తాను సినీ పెద్దిరకం తనకు వద్దని.. పంచాయితీలు తాను చేయలేనంటూ తేల్చి చెప్పారు. ఆ తరువాత కొద్ది గంటలకే ప్రముఖ హీరో మోహన్ బాబు ఒక లేఖ విడుదల చేసారు. గతంలో ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లిన విధానం..సమస్య పరిష్కారానికి అమలు చేయాల్సిన కార్యాచరణ అందులో వివరించారు. దీనికి నిర్మాత సీ కళ్యాణ్ తన దైన శైలిలో స్పందించారు. పరిశ్రమలోని మిగిలిన వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు, ఆర్జీవీ ట్వీట్ కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ఇచ్చారు.

నాగబాబు మద్దతు.. కొడాలి నాని కౌంటర్

నాగబాబు మద్దతు.. కొడాలి నాని కౌంటర్


సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ.. మీరు అడిగిన ప్రశ్నలన్నీ సత్యాలే.. నేను అడగలనుకున్న పది ప్రశ్నలు మీనోటి ద్వారా బయటకు వచ్చాయి.. అని నాగబాబు ట్వీట్ చేసారు. ఇక, ఈ అంశం పైన ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాంగోపాల్ వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రంలో ఉండి వర్మ ఏమైనా మాట్లాడతాడని.. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్ల వ్యాఖ్యలు, విమర్శలను తాము పట్టించుకోమన్నారు. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటేనని మంత్రి కొడాలి నాని కుండబద్ధలు కొట్టారు. ఇప్పటి వరకు ఆర్జీవి అనేక మంది పైన సెటైర్లు వేసినా.. సీఎం జగన్ పైన ఎప్పుడూ వ్యతిరేక కామెంట్లు చేయలేదు.

  AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
  ఆర్జీవి ఎంట్రీతో ఇష్యూ లో కొత్త మలుపు

  ఆర్జీవి ఎంట్రీతో ఇష్యూ లో కొత్త మలుపు


  కొన్ని ఇంటర్వ్యూల్లో సీఎం జగన్ పైన అభిమానం ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమా టిక్కెట్ల విషయంలో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు..ఆర్జీవి చేస్తుంది మరో ఎత్తు అనే విధంగా డైరెక్ట్ గా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. అయితే, ఆయన ట్యాగ్ చేసిన మంత్రి పేర్ని నాని రియాక్ట్ కాలేదు. మరో మంత్రి కొడాలి నాని తాము అసలు ఆర్జీవీని పట్టించుకోమనే విధంగా రివర్స్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో కొత్త టర్న్ గా మారిన ఆర్జీవీ.. ఇప్పుడు కొడాలి నాని స్పందన పైన ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆర్జీవి కామెంట్స్ కు మద్దతుగా కొందరు... ప్రభుత్వానికి మద్దతుగా మరి కొందరు తమ పోస్టింగ్ లతో హోరెత్తిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇష్యూ ఎటు మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొని ఉంది.

  English summary
  Mega Hero Nagababu Support RGV Comments and Questions against AP Govt, Minister Kodali nani reverse attack on RGV.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X