పొలిటికల్ ఎంట్రీపై, చిరంజీవిపై స్పందించిన మెగా హీరో సాయి దుర్గా తేజ్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రాజకీయాల పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి చిరంజీవితో కలిసి ఎప్పుడు ఆయన నటించబోతున్నాడు? చిరంజీవి పైన సాయిధరమ్ తేజ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు సంబరాల ఏటిగట్టు సినిమా గురించి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు.
అహోబిలం నరసింహస్వామిని దర్శించుకున్న మెగా హీరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సాయి దుర్గా తేజ దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహ స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ వేద పండితులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాజకీయాలపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్
ఇక ఇదే సమయంలో తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా గురించి అనేక అప్డేట్స్ చెప్పారు. తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇక రాజకీయాల గురించి ప్రస్తావించిన సాయి ధరమ్ తేజ్ తనకు రాజకీయాలతో పనిలేదని తేల్చి చెప్పారు. తాను ఈ క్షణంలో బ్రతికే మనిషినని పేర్కొన్నారు.
రాజకీయాలు అనుకున్నంత ఈజీ కాదన్న సుప్రీం హీరో
ప్రస్తుతానికి ఒక పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటానని రాజకీయం చేయడం అంటే మాట్లాడినంత ఈజీ కాదని ఆయన వెల్లడించారు. సినిమాలలో ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. రాజకీయాలు అంటే అనుకున్నంత ఈజీ కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు.
సినిమాలకు దూరం చెయ్యొద్దని రిక్వెస్ట్
తనను దయచేసి సినిమాలకు దూరం చెయ్యొద్దని, హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చెయ్యాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలంటే చాలా పెద్ద సబ్జెక్ అన్నారు. ఇక ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి తాను వచ్చిన క్రమంలో తనను దగ్గరుండి చూసుకున్న ఆలయ సిబ్బందికి మెగా అభిమానులకు జనసేన నాయకులకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications