Chiranjeevi: ప్రధాని ఏం చెప్పాడో చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ తో పాటు ఎంతో మంది ప్రముఖలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిరంజీవి, పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మోదీ చిరంజీవి, పవన్ కల్యాణ్ చేతులు పట్టుకుని వేదిక ముందుకు వచ్చారు. ప్రజలకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో ట్వీట్ చేశారు. తమతో మోదీ ఏ మాట్లాడారో కూడా చిరు పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని… pic.twitter.com/ZYg9YsSh6o
"ప్రధాని నరేంద్ర మోదీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏" అని మెగాస్టార్ పోస్ట్ చేశారు.
"తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!" అంటూ చిరంజీవి తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని చూడడానికి మెగాఫ్యామిలీ తరలొచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం చిరంజీవి, సురేఖ దంపతులు వచ్చారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ వచ్చింది.












Click it and Unblock the Notifications