స్టేట్ డివైడ్ అయినా.. దేఖ్ లేంగే: మెగాస్టార్ మాస్ వార్నింగ్
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం- భోళా శంకర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషిస్తోంది. చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్‌లో నటిస్తోంది కీర్తి సురేష్. అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళం మూవీ వేదాళంకు రీమేక్ ఇది. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు.
ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలేవీ పెద్దగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేదు.. ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్'పైనా అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ రెండింటి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం చిరంజీవి అభిమానులతో విజిల్స్ వేయించింది.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 133 కోట్ల రూపాయల క్లోజింగ్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇందులో వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టారు మెగాస్టార్. మాస్ లుక్స్‌తో కనిపించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. రవితేజ కూడా ఈ సినిమాలో నటించడం ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు మెగాస్టార్.
ఇక ఆయన నటించిన తాజా చిత్రం భోళాశంకర్‌పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి కిందటే విడుదలయింది. ఇందులో ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్‌ను పోషిస్తోన్నారు మెగాస్టార్. ట్యాక్సీ డ్రైవర్ రూపంలో తమ బాస్‌కు మరోసారి మాస్ క్యారెక్టర్ పడిదంటూ అభిమానులు సందడి చేస్తోన్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది భోళా శంకర్ టీజర్. కొద్దిసేపటి కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 థియేటర్లల్లో విడదలయింది టీజర్.
తెలంగాణ యాసలో చిరంజీవి అదరగొట్టారు. స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే. ఆల్ ఏరియాస్ నా ఫ్యాన్స్. నాకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్. 11 ఆగస్ట్ దేఖ్ లేంగే అంటూ విలన్ క్యారెక్టర్‌కు మాస్ వార్నింగ్ ఇవ్వడం.. సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తింది. ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోయే ఈ మూవీ కోసం మెగా కాంపౌండ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు.












Click it and Unblock the Notifications