వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌తో జత కట్టం: సబ్బం వ్యాఖ్యలపై మేకపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam - Mekapati
నెల్లూరు/ హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రతిస్పందించారు. ఆయన శుక్రవారం నెల్లూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెసుతో తాము జత కట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితిలో యుపిఎకు గానీ కాంగ్రెసుకు గానీ మద్దతు ఇవ్వబోమని మేకపాటి చెప్పారు. సబ్బం హరి ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. సబ్బం హరి ఎందుకలా మాట్లాడారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. లౌకిక పార్టీలకు, యుపిఎకు మద్దతు ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తామని జగన్ మూడేళ్ల క్రితం ఓ టీవీ చానెల్‌తో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు.

తమ పార్టీ యుపిఎ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌పాల్ బిల్లు వచ్చినప్పుడు రెండో రోజుకు తాము అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసుకున్నామని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నామని చెప్పడం దగుల్బాజీ రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.

కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులు దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాసానికి అవసరమైన మద్దుత కోసం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏ రోజు కూడా ప్రయత్నించలేదని ఆయన అన్నారు. అబద్దాలు చెప్పడంలో తెలుగుదేశం నాయకులది అందె వేసిన చేయి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
Retalaiting Congress rebel MP Sabbam hari's comments on YSR Congress party president YS Jagan, MP Mekapati Rajamohan Reddy clarified that YSRCP will not support Congress and UPA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X