బాబాయ్ చంద్రశేఖరరెడ్డిపై ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి పై ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ నాయకత్వం పైన తాజాగా చంద్రశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. స్థానిక వైసీపీ నేతలు వర్సస్ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎవరు వచ్చినా తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేకపాటి వారసుడు..ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
వైసీపీ వర్సస్ చంద్రశేఖర రెడ్డి
ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి వైసీపీ నేతలకు మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. సెంటర్ లో కుర్చీ వేసుకొని కూర్చున్న మేకపాటి వైసీపీ నేతలకు సవాల్ చేసారు. వచ్చే ఎన్నికల్లో తనకు జగన్ సీటు ఇవ్వనని చెప్పారని పలు ఇంటర్వ్యూల్లో చంద్రశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కొత్త వారు సీటు తమదేనని చెబుతున్నారని.. వారంతా నేతలు కాలేరంటూ వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను జగన్ వెన్నుపోటు పొడిచారని కామెంట్ చేసారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ దెబ్బ తింటుందని జోస్యం చెప్పారు. చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి చంద్రశేఖర రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు.

జగన్ తోనే మేకపాటి కుటుంబం
ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి తీరు పైన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పందించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితి ఏంటో తెలుస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవన్నారు. మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం వైయస్ జగన్‌తోనే ఉంటుందని, ఆయనతోనే ప్రయాణం సాగిస్తుందన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక మీడియాను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదన్నారు. ప్రజల గుండెల్లో సీఎం వైయస్ జగన్ పదిలంగా ఉన్నారన్నారు.

ఉదయగిరిలో వైసీపీ కొత్త ఇంఛార్జ్
తాను పార్టీ మారుతున్నాననే వార్తలను విక్రమ్ రెడ్డి ఖండించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలిచి సీఎం వైయస్ జగన్‌కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన అన్న కూడా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సీఎం జగన్ ను కలిసి తనకు లేదా తన కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వాలని కోరాగా.. జగన్ నుంచి సానుకూల స్పందన రాలేదని చంద్రశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సొంత పార్టీతో పాటుగా..కుటుంబ సభ్యుల నుంచి చంద్రశేఖర రెడ్డి పైన విమర్శలు మొదలయ్యాయి. ఉదయగిరిలో వైసీపీ కొత్త ఇంఛార్జ్ నియామకానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications