పార్టీలో అసంతృప్తులపై మేకపాటి, ఇదీ నిజం!.. సబ్బం

కాంగ్రెసులో మేథావులు: సబ్బం
కాంగ్రెసు పార్టీలో మేధావులు ఉన్నారని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. ఎంతటి వారినైనా చిత్తు చేస్తారని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులకు మద్దతివ్వడం అధిష్టానం గేమ్ ప్లాన్‌లో భాగమే అన్నారు. విభజకు సహకరిస్తామని కొంతమంది మంత్రులు చెప్పారన్నారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, విభజన విషయంలో కేంద్రం తీరు బాగోలేదన్నారు. సబ్బం.. రాజ్యసభ అంశం, తెలంగాణ, కిరణ్ వల్లే విభజన ప్రభావం అంశాలపై మాట్లాడారు.
సీమాంధ్ర ఎంపీలను ఎవరినీ సంప్రదించకుండా ఆఘమేఘాలపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆవగింజంత అవకాశం వచ్చినా సమైక్యాంధ్ర కోసమే పని చేస్తానని తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడి ఉంటే రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాను మూడేళ్లుగా మాట్లాడలేదని, అయితే విభజన నిర్ణయం తర్వాత కిరణ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. కిరణ్ సిఎంగా లేకపోతే మూడు నెలల కిందటే విభజన జరిగి ఉండేదన్నారు.
విభజనను అడ్డుకునే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని, రాష్ట్రపతి కూడా నిస్సహాయుడే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100లోపే ఎంపీ సీట్లు వస్తాయని, కాంగ్రెస్ భవిష్యత్ ఏంటో అర్థకావడం లేదని వెల్లడించారు. ఇష్టమైన పార్టీలోకి వెళ్లే హక్కు తనకు ఉందని సబ్బం చెప్పారు.












Click it and Unblock the Notifications