అక్కడ సిఎం నో: నిలిచిపోయిన మెట్రో పనులు(పిక్చర్స్)
హైదరాబాద్: చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా మెట్రో రైలు మార్గం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్న విషయం తెలిసిందే.
ఇందుకోసం ఆయన చర్యలు కూడా తీసుకుంటున్నారు. చారిత్రక సుల్తాన్ బజార్, మొజంజాహీ మార్కెట్‌లకు నష్టం జరగవద్దని కెసిఆర్ ఆదేశించినందున మొజంజాహీ మార్కెట్ వద్ద మెట్రో పనులు నిలిచిపోయాయి.
చారిత్రక కట్టడాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ మెట్రో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి నుండి డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తెరాస ప్రభుత్వం రావడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

మొజంజాహీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడం మొజంజాహీ మార్కెట్ దృశ్యం. ఇది హైదరాబాదులోని ఆబిడ్స్ ప్రాంతంలో ఉంది.

మొజంజాహీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ మెట్రో చేపట్టాలని తెరాస భావిస్తోంది.

మొజంజాహీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ మెట్రో చేపట్టాలని తెరాస భావిస్తోంది. దీంతో పనులు నిలిచిపోయాయి.

మొజంజాహీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మొజంజాహీ మార్కెట్ వద్ద మెట్రో పనులు నిలిచిపోయిన దృశ్యం.

మొజంజాహీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే చారిత్రక కట్టడాలు ఉన్న చోట అండర్ గ్రౌండ్ వేయాలని కెసిఆర్ సూచించడంతో మొజంజాహీ మార్కెట్ వద్ద పనులు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications