గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది. ఈక్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం ఇప్పటికే నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే విజయవాడలోని తాజ్ హోటల్‌లో పనిచేసే చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి ట్రైనింగ్ ఇప్పించింది. ముఖ్యంగా అందులో పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, పొంగల్, పప్పుచారు, వంటి వంటకాల తయారీపై తాజ్ హోటల్ చెఫ్‌లు ట్రైనింగ్ ఇచ్చారు.తాజ్ హోటల్ చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం రుచికరంగా చేసేందుకు అవసరమయ్యే టిప్స్‌తో వీడియోలను కూడా ప్రభుత్వం రూపొందించింది. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో అప్లోడ్ చేశారు.

జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలకు రూపురేఖలే మారిపోయాయి.ప‍్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందించడం, ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యత కలిగిన రుచికరమైన భోజనం అందింస్తూ జగన్ సర్కార్ తనదైన మార్క్‌ను వేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల గురించి ఆలోచించి ప్రత్యేకంగా నాణ్యత కలిగిన, రుచికరమైన భోజనం అందించేందుకు కృషి చేయడంతో సీఎం జగన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications