ప్రాదేశికంలోనూ సత్తా చాటిన అసదుద్దీన్ మజ్లీస్

కొత్తపేటలో ఏడు ఎంపిటిసి స్థానాలకు గాను, ఏడింటిని కైవసం చేసుకుంది. జల్‌పల్లిలో నాలుగు ఎంపిటిసి స్థానాలకు గాను ఒక స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిలాల్లో ఒక్కొక్క ఎంపిటిసి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్టు మజ్లిస్ నాయకులు తెలిపారు.
తెలంగాణ జిల్లాల్లోని పలు మునిసిపాలిటీల్లో గెలుపొందిన మజ్లిస్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు దారుల్‌సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని, ఆ పార్టీ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికైనవారిని మజ్లీస్ అధినేత అభినందించారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా భైంసాలో చైర్మన్, వైస్‌చైర్మన్‌గా పార్టీ ఖరారు చేసే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు.
తెలంగాణలో మజ్లిస్ కీలకపాత్ర పోషిస్తుందని, పార్టీ నుంచి ఎన్నికైన వార్డు సభ్యులు, కౌన్సిలర్లు అంకితభావంతో సేవలందించాలని, పార్టీని మరింత విస్తరించి పటిష్టం చేయాలని సూచించారు. అసద్‌ను కలిసిన వారిలో బైంసా, నిజామాబాద్, నిర్మల్, తాండూరు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి పట్టణాల్లో ఎన్నికైన వారితో పాటు కార్యకర్తలున్నారు.












Click it and Unblock the Notifications