ఏపీ మంత్రి ఆది కాన్వాయ్‌‌కు ప్రమాదం: తృటిలో తప్పిన ముప్పు..

Subscribe to Oneindia Telugu

సూర్యాపేట: ఏపీ మార్కెటింగ్, మత్స్య, సహాయక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మంత్రి నారాయణరెడ్డి ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.

సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం పడుతుండటంతో రహదారి సరిగా కనిపించక డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టినట్లుగా చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన గన్ మెన్లు, డ్రైవర్ ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

 minister adinarayana convoy meets with accident in kodada

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Minister Adi Narayana Reddy convoy met with an accident at Kodada while going to Amaravati from Hyderabad.
Please Wait while comments are loading...