Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మనాన్నలనే కోల్పోయాక అంతకన్నా పెద్ద బాధా?: టీడీపీలో గంగుల చేరికపై అఖిలప్రియ

అమ్మనాన్నలనే కోల్పోయిన తనకు అంతకన్నా పెద్ద బాధ ఇంకేది ఉండదన్నారు మంత్రి అఖిలప్రియ. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం వల్ల తనకెలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు.

కర్నూలు: మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరుతుండటంతో మంత్రి అఖిలప్రియకు ఇబ్బందులు తప్పవన్న వాదన తెర పైకి వచ్చింది. ఏళ్లుగా భూమా-గంగుల కుటుంబాల మధ్య ఉన్న వైరం ఇందుకు కారణం.

అయితే అఖిలప్రియ మాత్రం దీనిపై మరోలా స్పందించారు. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం వల్ల తనకెలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు. మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు.

minister akhilapriya response over gangula pratap reddy joins in tdp
తమ కుటుంబానికి గంగుల కుటుంబానికి మధ్య వైరం ఉన్న మాట వాస్తవమేనని, అయినప్పటికీ తమ మధ్య ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. అమ్మ-నాన్నలను కోల్పోయిన తమకు ఇంకే సమస్య అంత పెద్దది కాదని అఖిల వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, నిజానికి వైసీపీ తరుపున నంద్యాల టికెట్ గంగుల ప్రతాప్ రెడ్డికే దక్కుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ.. టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డికే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అసంతృప్తికి లోనైన గంగుల వైసీపీలో చేరనే లేదు. తిరిగి ఇప్పుడు పాత గూటికే చేరబోతున్నారు.

ఇప్ప‌టికే గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. వారి వార‌సుడు ఆళ్ల‌గ‌డ్డ బాధ్య‌త‌ల్లో ఉన్నారు. తాజాగా ప్ర‌తాప్ రెడ్డి టీడీపీలో చేరుతుండటంతో.. కర్నూలు రాజకీయాల్లో అటు అధికార పార్టీలోను, ఇటు ప్రతిపక్ష పార్టీలోను గంగుల కుటుంబం హవా మొదలవబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+