తానడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబూ.. మంత్రి అంబటి రాంబాబు తగ్గట్లేదుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని నిత్యం టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుపై టిడిపి, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుని టార్గెట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు 3 ప్రశ్నలను సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్ పై మూడు ప్రశ్నలు సంధించిన అంబటి రాంబాబు
ఇక వైసీపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు సంధించిన ప్రశ్నలను చూస్తే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తాం అని చెప్పినా, నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్మించడానికి తీసుకుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇక రెండవ ప్రశ్న 2018 సంవత్సరానికి ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఇక మూడవ ప్రశ్నగా కాపర్ డ్యామ్ ల నిర్మాణం చేయకుండా, డయాఫ్రం వాల్ ఎందుకు నిర్మించారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు అంబటి రాంబాబు.

అప్పటి టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే పోలవరం పరిస్థితి ఇలా
ఇక ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కానీ అప్పటి టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు తెలుగుదేశం పార్టీ పూర్తి చేయలేకపోవడానికి, ఈరోజు స్లోగా పనులు జరగడానికి కారణం డయాఫ్రం వాల్ అంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న అంశంపై పలు సందేహాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావటానికి కారణం చంద్రబాబే
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబు నాయుడు పనితనమే కారణమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిర్మాణం జరుగుతున్న చోట లోపల ఆగాధాలున్నాయని, వరదల కారణంగా లోయర్ కాపర్ డ్యాం పనులు జరగలేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడటం సరైనది కాదంటూ అంబటి రాంబాబు విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

పోలవరంపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం
ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇక ఈ వ్యవహారం టిడిపి, వైసిపి మధ్య అనునిత్యం మాటల యుద్ధానికి కారణంగా మారింది. మీ వల్ల అంటే మీ వల్ల అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు వైసిపి, టిడిపి నాయకులు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications