పవన్ కళ్యాణ్ కు మంత్రి అంబటి రాంబాబు సూటిప్రశ్న.. పవన్ ఫ్యాన్స్ ఘాటు రిప్లై!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తోంది. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు ఆసక్తికరమైన ప్రశ్న వేయగా, దానికి పవన్ ఫాన్స్ నుండి ఘాటుగా సమాధానం వస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవం నాడు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

స్వాతంత్ర్య దినోత్సవం నాడు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ఏపీలోని ప్రభుత్వ అసమర్థ పాలనను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా జనసేన పనిచేస్తుందని పేర్కొన్న ఆయన, కుల రాజకీయాలు చేస్తే గత ఎన్నికలలో 40 సీట్లు వచ్చేవని, తాను ఎప్పుడో ఎంపీని అయ్యేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన సైనికులకు దిశానిర్దేశం చేస్తూ చేసిన ఆయన ప్రసంగంలో మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వనని తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను, జగన్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ను దత్త పుత్రుడు అంటూ టార్గెట్ చేస్తున్న అంబటి రాంబాబు


ఇక ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ పదేపదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక అడ్డంకులు కల్పించడానికి ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఇంతకుముందు విమర్శించిన అంబటి రాంబాబు, వానలు, వరదలు వచ్చినా తాము ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నామని, తమ జాడేది దత్త పుత్రా అంటూ పవన్ కళ్యాణ్ ను ఇంతకుముందే టార్గెట్ చేశారు .

పవన్ కళ్యాణ్ కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి ... ఆ పని చేస్తారా? ప్రశ్నించిన మంత్రి అంబటి

పవన్ కళ్యాణ్ కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి ... ఆ పని చేస్తారా? ప్రశ్నించిన మంత్రి అంబటి

ఇక తాజాగా స్వాతంత్ర దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారా లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండిపెండెన్స్ డే రోజున ఈ విషయాన్ని ప్రకటించాలని ఆయన పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు. 175 సీట్లకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు అయితే జనసేన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్న సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుందని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటే జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న సంకేతమని అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ను బట్టి పలువురు భావిస్తున్నారు.

జనసేన, పవన్ అభిమానుల నుండి అంబటికి చురకలు

జనసేన, పవన్ అభిమానుల నుండి అంబటికి చురకలు

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన పార్టీ నేతల నుండి అంబటి రాంబాబు ట్వీట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి తప్ప అంబటి రాంబాబు దేనికీ పనికి రాడని పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శిస్తున్నారు. జగన్ దగ్గర అంబటి రాంబాబుకి విలువ లేదని, కాపులను జగన్ కాళ్ళ కిందకు నెట్టాడని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంబటి రాంబాబుకి ముందుంది ముసళ్ళ పండగ అంటూ పలువురు అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే సీట్లలో ముందు అంబటి రాంబాబు స్థానమే ఉంటుందని కూడా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+