పవన్ భారీ సొల్లు డైలాగుల వెనుక కారణమిదేగా.. వదిలిపెట్టని మంత్రి అంబటి రాంబాబు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మరోమారు ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు బాబుకు మధ్య డబ్బుల లావాదేవీలు జరిగాయని అందుకే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వను అని భారీ సొల్లు డైలాగ్ లు చెప్తున్నారని మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్త పుత్రుడు అని వ్యాఖ్యానిస్తూ టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని, వైసిపి విముక్తి ఆంధ్ర నా ధ్యేయమని పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఈ భారీ సొల్లు డైలాగులు చెబుతున్నారంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

బాబు దగ్గర అడ్వాన్స్ ముట్టినందుకే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని భారీ డైలాగులు

బాబు దగ్గర అడ్వాన్స్ ముట్టినందుకే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని భారీ డైలాగులు

బాబు గారి దగ్గర నుండి అడ్వాన్స్ ముట్టింది అని చెప్పొచ్చుగా అంటూ అంబటి రాంబాబు, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈనాటి ఈ బంధమేనాటిదో అంటూ అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఒక ఫోటోను పాటతో కలిపి జతచేసి పెట్టి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. అంతేకాదు ప్రశ్నించడానికి పుట్టాను అంటున్న పార్టీ, ప్రశ్నిస్తే పారిపోతుంది ఏమిటీ అంటూ తాను అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్, నాగబాబులు సమాధానం చెప్పలేదని టార్గెట్ చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.

అంతకు ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్న .. బదులిచ్చిన నాగబాబు

అంతకు ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్న .. బదులిచ్చిన నాగబాబు

ఇక అంతకు ముందు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి కాటన్ దుస్తులు చాలెంజ్ లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారా లేదా అని ప్రశ్నించిన అంబటి రాంబాబుకు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు ఆసక్తికర పంచ్ వేశారు. ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! అని ప్రశ్నించిన నాగబాబు, బాబూ... ఓ రాంబాబు... జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్ కి, వైసిపి సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జన సైనికులకు లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదంటూ సెటైర్ వేశారు.

నాగబాబుకు మంత్రి అంబటి సెటైర్

నాగబాబుకు మంత్రి అంబటి సెటైర్


అంబటి రాంబాబు ఫోటోను బఫూన్ గా మార్చి ఫోటో ను ఆ పోస్టులో పెట్టారు. ఇక దీనికి రివర్స్ కౌంటర్ వేసిన అంబటి రాంబాబు భలే వారండి .. నాగ బాబు గారు ఎంత ఓపిగ్గా, ఎంత తీరిగ్గా నా బొమ్మేశారండి.. ఖాళీగా ఉన్నట్టున్నారు ధన్యవాదాలు అంటూ నాగబాబును టార్గెట్ చేశారు. పనీపాట లేదని ఎద్దేవా చేశారు. ఇలా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ను పదేపదే టార్గెట్ చేస్తూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వార్తల్లో నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+