వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏపీని శ్రీలంకగా మార్చే యత్నంలోనే కోనసీమఅల్లర్లు: మండిపడిన మంత్రి అంబటి

|
Google Oneindia TeluguNews

కోనసీమలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏది అంతు చిక్కకుండా ఉంది. కోనసీమ జిల్లాను బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం పై కొనసాగుతున్న ఆందోళనలు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారాయి. కోనసీమలో అల్లర్లకు కారణం మీరంటే మీరంటూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు ఏపీ లోని రాజకీయ పార్టీల నేతలు. కోనసీమలో హింసాత్మక ఘటనల వెనుక టిడిపి, జనసేన ఉన్నాయని వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

టీడీపీ, జనసేనలపై మంత్రి అంబటి ఫైర్

టీడీపీ, జనసేనలపై మంత్రి అంబటి ఫైర్

తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, జనసేన ల పై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. అమలాపురం ఘటన దురదృష్టకరమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నాం అన్నమాట పవన్ నోటి నుంచి రాలేదంటూ ఆరోపించారు. దాడులను ఖండించకుండా పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఉక్కు పాదంతో అల్లర్లను అణిచి వేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

పవన్, చంద్రబాబు రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చే యత్నం చేస్తున్నారు

పవన్, చంద్రబాబు రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చే యత్నం చేస్తున్నారు

గతంలో కోనసీమ జిల్లా మార్పు అంశంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు నిరాహారదీక్షలు చేసిందో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ప్రజల నుండి డిమాండ్ వచ్చినప్పుడు దానిని పరిశీలించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్న అంబటి రాంబాబు ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ పాత్ర ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు తమ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తామే తగలబెట్టుకుంటామా అంటూ ప్రశ్నించారు. ఏపీ కూడా శ్రీలంక అవుతుందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు అన్నారని, ఇప్పుడు వాళ్లిద్దరూ రాష్ట్రాన్ని శ్రీలంక గా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు .

కోనసీమ లో జరిగిన సంఘటనలో కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం

కోనసీమ లో జరిగిన సంఘటనలో కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం


కోనసీమ జిల్లా అమలాపురంలో ఇల్లు, వాహనాలు తగలబడుతుంటే చివరకు మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్ కూడా రాకుండా అడ్డం వేశారంటూ అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు మాట్లాడితే తుని సంఘటనను దీనికి ముడి పెడుతున్నారంటూ మండిపడ్డారు. డైవర్షన్ అనడానికి పవన్ కళ్యాణ్ కు అస్సలు అవగాహన లేదని పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు కోనసీమ లో జరిగిన సంఘటనలో కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఈ ఘటనల వెనుక ఉంది ప్రతిపక్ష పార్టీల నాయకులే అని స్పష్టం చేశారు.

కోనసీమలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి

కోనసీమలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి

ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాలో ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న చలో రావులపాలెం కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ రావులపాలెం పట్టణంలోని కళావెంకట్రావు విగ్రహం వద్ద నిరసన కారులు ఆందోళన తెలుపుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావులపాలెంలో నిరసనలు ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా షాపులన్నింటిని మూయించేశారు. యువతను రోడ్డుపైకి రావద్దు అని విజ్ఞప్తి చేసి 100 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

English summary
Minister Ambati Rambabu was indignant that the riots were taking place in an attempt to turn Pawan Kalyan and Chandrababu AP into Sri Lanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X