గోదావరి పుష్కరాల ముహూర్తం, నిర్వహణ పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
గోదావరి పుష్కరాల ముహూర్తం ఫైనల్ అయింది. అనేక చర్చల తరువాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది. కాగా, పుష్కరా లు ఖరారు అయ్యాయి. ఈ సారి గోదావరి పుష్కరాలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని సర్కారు నిర్ణయించారు. దాదాపు 8 కోట్ల మంది భక్తుల వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. కాగా, గోదావరి పుష్కరాలకు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. అన్ని దేవాలయా లను పున: నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు. పుష్కరాలకు సంబంధించి రాజమండ్రిలో రూ.9.55 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశామని వివరించారు. రాజమండ్రితోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలను గోదావరి పుష్కరాలకు అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కుంభమేలా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు
కాగా, ఇప్పటికే 43 దేవాలయాల పున: నిర్మాణం కోసం రూ.51 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి ఆనం తెలిపారు. హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా చూస్తుంది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్య ఇస్తూ.. రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications