మీకు అభ్యర్థులకే దిక్కు లేదు.. మీరు మాకు పోటీనా? టీడీపీ దుస్థితి చెప్పిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియపై చంద్రబాబు నాయుడు వైసీపీని, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేయడంతో, చంద్రబాబు పై ధ్వజమెత్తారు వైసీపీ మంత్రులు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టార్గెట్ చేశారు.తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని, అభ్యర్థులను నిలబెట్టే దిక్కే లేదని, అలాంటిది మీరా మాకు పోటీ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీకి అభ్యర్థులే లేరన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీకి అభ్యర్థులే లేరన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్


నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి కూడా టిడిపికి లేదని, నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీకి అడ్డా అని మరోసారి నిరూపిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం నుండి నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కాగా ఈ రోజు సాయంత్రానికి నామినేషన్ల దాఖలు ముగియనుంది.

 పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క పోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం

పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క పోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం

ఈ క్రమంలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న వివిధ డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యానికి దుస్థితికి అద్దం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు నిలబెట్టుకోవడం చేతగాక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని, ఘన విజయాన్ని దక్కించుకుంటుంది అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

టిడిపి పొత్తుల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఎద్దేవా

టిడిపి పొత్తుల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఎద్దేవా

కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో టీడీపీకి అభ్యర్థులు లేరని, అభ్యర్థులు లేక, ఆ విషయం చెప్పలేని టిడిపి, టిడిపి అభ్యర్థులు పోటీ చేయకుండా తాము భయ పెడుతున్నాము అని చెప్పడం దారుణమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. 40వ డివిజన్ లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ఒక మనిషి కూడా రాలేదని, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి పొత్తుల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోందని తెలిపిన అనిల్ కుమార్ యాదవ్ ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేక నీచ రాజకీయాలకు దిగుతుందని మండిపడ్డారు.

ఏపీలో 2019 నుండి అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా

ఏపీలో 2019 నుండి అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా

2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికలలోనూ వైసిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నాడని, అందుకే టీడీపీ నేతలు, చంద్రబాబు వైసీపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు.

తాజాగా మరో ఎన్నికల ప్రక్రియ .. అనిల్ కుమార్ మాటల యుద్ధం అందుకే

తాజాగా మరో ఎన్నికల ప్రక్రియ .. అనిల్ కుమార్ మాటల యుద్ధం అందుకే


ఇదిలా ఉంటే ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ తో సహా 12 మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, ఎంపీటీసీలు, జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 17 వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు .ఇక ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు ఈనెల 16వ తేదీన పోలింగ్ నిర్వహించి, 18వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. పంచాయతీలకు ఈనెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగు దేశం పార్టీ పై, ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+