ఆ ప్రచారం నమ్మొద్దు, ఆ పార్టీలకు ఓటేస్తే ఉపయోగం లేదు: నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాలలో మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ప్రతిపక్షాల నుండి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ఎన్నికలలో అయినా తమ ఉనికి చాటుకోవాలని ప్రతిపక్షాలు, మళ్ళీ చావు దెబ్బ కొట్టాలని వైసీపీ తెగ ప్రయత్నం చేస్తున్నాయి.

టీడీపీ, సీపీఎం నాయకుల మాటలు నమ్మొద్దు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్
శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టిడిపి నేతలను చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతల మాటలు నమ్మొద్దని, వారు చేస్తున్నది దుష్ప్రచారం అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 54వ డివిజన్ లో వైసిపి నుండి అభ్యర్థిగా బరిలోకి దిగిన షఫియా బేగంతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

కావాలనే ఇళ్ళ విషయంలో దుష్ప్రచారం, వారికి ఓటేస్తే ఉపయోగం లేదు
ఇస్లాంపేట, భగత్ సింగ్ కాలనీ లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని స్పష్టం చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు, సిపిఎం నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీలకు ఓటు వేసినా ఉపయోగం లేదని, ఇక ఆ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు అని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, ఆయన పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ కితాబిచ్చారు.

54 డివిజన్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 54 డివిజన్లు ఉన్నాయని, ఈ 54 డివిజన్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోందని అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటు చాలా విలువైనది అని గుర్తు చేసిన అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంత దుష్ర్పచారం చేసినా, ప్రజల మద్దతు తమకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక మొన్నటికి మొన్న టిడిపి అభ్యర్థులు లేరని, అలాంటి టిడిపి వైసీపీకి పోటీనా అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
Recommended Video

అభ్యర్థులే లేరని ఎద్దేవా , టీడీపీ నీచ రాజకీయాలపై ఆగ్రహం
అంతకు ముందు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి కూడా టిడిపికి లేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీకి అడ్డా అని మరోసారి నిరూపిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నామినేషన్ల సమయంలో తెలుగుదేశం పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యానికి దుస్థితికి అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు నిలబెట్టుకోవడం చేతగాక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇప్పుడు టీడీపీ ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అవుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications