ఎక్కడికెళ్లినా సీఎం అవుతానంటారు!, పిల్లల ఆటలా?: జగన్‌ను ఏకేసిన అశోక్ గజపతి

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో జీఎస్‌టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కొన్ని పార్టీలు.. రాష్ట్రాలకు వచ్చేసరికి స్వప్రయోజనాల కోసం బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న పిల్లలాట కాదు

చిన్న పిల్లలాట కాదు

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం ఇరువాడ గ్రామంలో సోమవారం ఆయన రూ. 1.7 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. అర్ధంలేని రాజకీయాలు సరికాదని, రాజకీయాలంటే చిన్నపిల్లలాట కాదని జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా హితవు పలికారు.

హెచ్చరికలు చేస్తారా?

హెచ్చరికలు చేస్తారా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజూ యుద్ధం చేసుకోవాలని రాష్ట్రంలో కొందరు భావిస్తున్నారని... టీడీపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు తెచ్చుకోవాలని చూస్తోందని అన్నారు.
అక్రమంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టి 13 నెలలు జైల్లో ఉన్న నాయకుడు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగి ‘నేను కాబోయే ముఖ్యమంత్రిని, నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటా జాగ్రత్త' అంటూ అధికారులతో దురుసుగా మాట్లాడాడని జగన్‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పగను పెంచుకుంటారా?

పగను పెంచుకుంటారా?

పదవిలో ఉండాలనుకునే వారు ప్రజలను గుర్తుంచుకోవాలి తప్ప అధికారులపై పగను పెంచుకోకూడదని అశోక్ గజపతి రాజు అన్నారు. మహిళలు పొగబారినపడి అనారోగ్యానికి గురికాకుండా గతంలో టీడీ ప్రభుత్వం దీపం పథకం తీసుకువస్తే.. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు గ్యాస్‌ పొయ్యిలని పక్కన పెట్టారని ప్రశ్నించారు.

అన్నీ ఆదర్శంగానే..

అన్నీ ఆదర్శంగానే..

ఆదర్శ గ్రామాల్లో అన్నీ ఆదర్శంగానే ఉండాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. అభివృద్ధి పనులతోపాటు అక్షరాస్యత కూడా సాధించాలన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందాలంటే చదువు ద్వారానే సాధ్యమన్నారు. విభిన్న తేడాలు ఉన్న దేశంలో అందరూ ఒక్కటిగా ఉన్నారంటే సంస్కృతే దీనికి కారణమన్నారు. దత్తత గ్రామాల్లో ఉండే ప్రజల ఆలోచన, ఆచరణ, ప్రవర్తనలో కూడా మంచి మార్పు తీసుకురావాలన్నారు. అనంతరం అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఎంపీ దంపతులను ఘనంగా సత్కరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union minister Ashok Gajapathi Raju on Monday lashed out at YSR Congress Party president YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...