విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం క్లారిటీ-త్వరలో పనులు ప్రారంభం-వైసీపీ ఎంపీలకు హామీ

|
Google Oneindia TeluguNews

విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం చేతులెత్తేసిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ మరో క్లారిటీ వచ్చింది. పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. దీనిపై చర్చించారు. చివరికి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వైసీపీ ఎంపీలు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో రైల్వే జోన్ పై నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయింది.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు


విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలో మోడీ సర్కార్ ప్రకటన చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని గతంలో పార్లమెంట్ లోనే హామీ ఇచ్చింది. దీని ప్రకారం క్షేత్రస్దాయిలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాల్ని కూడా పంపారు. దీంతో త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటవుతుందని అంతా ఆశించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా దీనిపై ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై పార్లెమంటులో ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

 కొత్త జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదన్న కేంద్రం

కొత్త జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదన్న కేంద్రం


తాజాగా పార్లమెంట్ లో పొరుగు రాష్ట్ర ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని చెప్పేశారు. దీంతో ఏపీ ప్రజలు, నేతలు అవాక్కయ్యారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిస్ధితి ఏమైందో తెలియక గందరగోళానికి గురయ్యారు. వెంటనే రాజకీయ పార్టీలు అప్రమత్తం అవుతాయని భావించినా అలా జరగలేదు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో దీనిపై ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అయినా కేంద్రం మాత్రం గందరగోళ పరిచే సమాధానాలు ఇచ్చింది.

రైల్వే మంత్రి క్లారిటీ

రైల్వే మంత్రి క్లారిటీ

పార్లమెంటులో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి ఇవాళ ఆయన్ను కలిశారు. పార్లమెంటులోని మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వ్రకటనను ఆయన వద్ద ప్రస్తావించారు. దీంతో మంత్రి వైసీపీ ఎంపీలకు రైల్వే జోన్ పై క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటులో చేసిన ప్రకటన, తాజాగా ఇచ్చి న క్లారిటీతో వైసీపీ ఎంపీలు సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో అదే విషయాన్ని వారు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

Recommended Video

Weather Forecast : New Low Pressure, Heavy Rains Again In AP & TS || Oneindia Telugu
త్వరలో రైల్వే జోన్ పనులు

త్వరలో రైల్వే జోన్ పనులు

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత మిధున్‌ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్‌ రెడ్డి పేర్కొన్నారు.

English summary
the union railway minister ashwini vaishnaw on today assured ysrcp mps' vijaya sai reddy and mithun reddy to start south coastal railway zone works soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X