మళ్ళీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ... ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మూడు రాజధానులు బిల్లులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి తిరిగి మెరుగైన బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెడతామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నదానిపై రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

మూడు రాజధానుల బిల్లులు ఎప్పుడు పెడతారో చెప్పిన మంత్రి బాలినేని

మూడు రాజధానుల బిల్లులు ఎప్పుడు పెడతారో చెప్పిన మంత్రి బాలినేని

ఈరోజు కర్నూలు జిల్లా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వామి వారి దర్శనం అనంతరం మూడు రాజధానులు బిల్లులను రానున్న మార్చిలో శాసన సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లులలో ఉన్న సాంకేతిక సమస్యల దృష్ట్యా బిల్లులను రద్దు చేసినట్టు, కొన్ని అంశాలను సరిగా పెట్టకపోవడం వల్ల వెనక్కి తీసుకోవాల్సి వచ్చినట్టు పేర్కొన్న ఆయన వచ్చే ఏడాది మార్చి బడ్జెట్లో మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెడతామని క్లారిటీ ఇచ్చారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ జగన్ మూడు రాజధానుల నిర్ణయం

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ జగన్ మూడు రాజధానుల నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా నిర్ణయించి, రాజధాని నగరాన్ని అత్యంత ఉన్నత ప్రమాణాలతో, అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. ఇక ఏపీలో గత ఎన్నికల తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టాక 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

రాజధాని వ్యవహారంలో ఏపీలో నెలకొన్న గందరగోళం

రాజధాని వ్యవహారంలో ఏపీలో నెలకొన్న గందరగోళం


అంతే కాదు అసెంబ్లీలో బిల్లులు పెట్టి బిల్లులను కూడా ఆమోదింపజేశారు. ఇక 3 రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. తాజాగా మరోమారు మూడు రాజధానుల బిల్లులను రద్దు చేయడం, మళ్లీ కొత్త బిల్లులు పెడతామని చెప్పడం ఏపీలో గందరగోళానికి కారణంగా మారింది. ఏపీలో రాజధాని వ్యవహారంపై అనిశ్చితి నెలకొంది. మూడు రాజధానుల కొత్త బిల్లులను ప్రవేశ పెడతామని చెప్పినప్పటికీ అది ఎప్పుడూ అన్నదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మార్చిలో మళ్లీ మూడు రాజధానుల బిల్లులు ప్రవేశ పెడతామని చెప్పి ఉత్కంఠకు తెర దించారు. మంత్రి చెప్పినట్లు మార్చిలో బిల్లును ప్రవేశపెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మూడు రాజధానుల నిర్ణయానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉందన్న వైసీపీ మంత్రులు

మూడు రాజధానుల నిర్ణయానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉందన్న వైసీపీ మంత్రులు

ఇప్పటికే వైసీపీ మంత్రులు మూడు రాజధానుల నిర్ణయానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉందని, మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటును ఆపేది లేదని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని క్లారిటీ ఇస్తున్నారు. మూడు రాజధానుల బిల్లులు రద్దు చేసిన సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఇంటర్వెల్ మాత్రమే సినిమా ఇంకా అయిపోలేదు అంటూ, శుభం కార్డు పడడానికి సమయం ఇంకా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మార్చిలో మూడు రాజధానుల బిల్లు మళ్ళీ అసెంబ్లీ ముందుకు

మార్చిలో మూడు రాజధానుల బిల్లు మళ్ళీ అసెంబ్లీ ముందుకు

మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానులు నిర్ణయం పై వెనక్కి తగ్గేది లేదని, మడమ తిప్పేది లేదని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల వ్యవహారంపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీఎం జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న వికేంద్రీకరణ బిల్లులో మరికొన్ని విషయాలను జత చేర్చి వచ్చే నెలలో లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లో, మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. డిసెంబర్ లో బిల్లులు పెడతారని కొందరు వైసీపీ నాయకులు భావించారు. కానీ మళ్ళీ మార్చిలో బిల్లులు పెడతామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+