త్వరలో స్పెయిన్‌కు మంత్రి భూమా అఖిలప్రియ, 15 నుంచి 22 వరకు

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి భూమా అఖిలప్రియ ఈ నెల 15 నుంచి 22 వరకు అధికారిక పర్యటన నిమిత్తం స్పెయిన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అనుమతించినట్లు సాధారణ పరిపాలనా విభాగం రాజకీయ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ఆళ్లగడ్డలో రూ.50 లక్షలతో బస్టాండు విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణాలకు అఖిల ప్రియ గురువారం శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెందిన నిధులతో త్వరలోనే సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు.

Minister Bhuma Akhila Priya tour in Spain

సీసీ రోడ్డు పూర్తయితే బస్టాండులోని సమస్యలు ఎన్నో పరిష్కారం అవుతాయని చెప్పారు. త్వరలోనే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఆడిటోరియం ఏర్పాటు చేసతామని ఆమె చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister and Telugu Desam Party leader Bhuma Akhila Priya tour in Spain.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి