సర్వేలో నిజాలు: చంద్రబాబు మాదిరే అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే చకా చకా సాగిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో ఆయన తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

నాకు ఉద్యోగమిస్తే... నీ ఉద్యోగం ఊడుతుంది!: సర్వే ఎన్యూమరేటర్‌తో చంద్రబాబు
మంగళవారం ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని తన ఇంటి నుంచి ఈ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కుటుంబ సభ్యుల వివరాలను అందజేశారు. అయితే ఈ సర్వేలో మంత్రి దేవినేని తన ఆస్తుల వివరాలను వెల్లడించక పోవడం విశేషం.

'ఇది ఒక చరిత్ర‌': పల్స్ సర్వేలో స్వయంగా వివరాలు చెప్పిన చంద్రబాబు

తనకు గజం స్థలంలో కూడా లేదని, కృష్ణా జిల్లాలోని అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సర్వే అధికారులకు తన ఆధార్, ఓటర్ కార్డలోని విషయాలను మాత్రమే అందజేశారు. గొల్లపూడికి చెందిన ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి మంత్రి వివరాలను నమోదుచేసుకున్నారు.

సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం 80 ప్రశ్నలకు వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తనకు శాశ్వత నివాసం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న లింగమనేని హౌస్ ఆర్సీసీ శ్లాబ్ రకానికి చెందినదని చెప్పిన ఆయన, ఈ భవంతిని ప్రభుత్వం అద్దెకు తీసుకుందని చెప్పారు.

ఆ నివాసం సొంతమా? అద్దె ఇల్లా? అని ప్రశ్నించిన ఎన్యూమరేటర్ ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సొంతమంటే కబ్జా అంటారు. ఈ భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇంకా స్వాధీనం చేసుకోలేదు'' అని ఆయన అసలు విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Minister devineni umamaheswara rao participates in smart survey

జగన్‌ను కలిసిన ఆయిల్ ఫాం రైతులు

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్‌ని ఆయిల్ ఫాం రైతులు కలిశారు. దుద్దుకూరులో చింతమనేని హనుమంతరావు ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఉదయం జగన్‌ను కలిసి ఆయిల్ ఫాం సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు తెలిపారు. క్రూడ్ పామాయిల్ పై 12.5 శాతం దిగుమతి పన్ను విధించారని, అయితే పామాయిల్ టన్నుకు మద్దతు ధర రూ.7,494 మాత్రమే ఇస్తున్నారన్నారు. టన్ను పామాయిల్ మద్దతు ధర రూ. 10వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు ఈ సందర్భంగా జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే బుధవారం నాడు జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులకు ముఖాముఖి కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కుక్కునూరులో పర్యటించనున్నారు. పోలవరం నిర్వాసితుల రిలే దీక్షకు వైఎస్ జగన్ మద్దతు పలకనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister devineni umamaheswara rao participates in smart survey.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి