వైసీపీ నాయకులందరం చెడిపోయాం: ధర్మాన ప్రసాదరావు
తనకు అవినీతి అంటే అసలు నచ్చదని, ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నామని, అందరం చెడిపోయి ఉన్నామన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్నామని ఎప్పుడూ, ఎక్కడా అవినీతి చేయలేదన్నారు. ప్రజలు తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదన్నారు.
తాను ఎక్కడైనా సరే నయాపైసా అవినీతికి పాల్పడ్డానేమో నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ధర్మాన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రెండెకరాలున్న చంద్రబాబుకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

తనపై కేసులు విచారణకు రాకుండా చంద్రబాబు స్టేలు తీసుకొస్తుంటారని, తనను గెలిపించే ప్రజలు తలదించుకునేలా ఎప్పుడూ పని చేయలేదని ధర్మాన స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రోకర్ల వ్యవస్థ ఉండేదని, ప్రతి పనికి డబ్బు పంచుకునేవారని మండిపడ్డారు. కానీ ఈరోజు ప్రతి పైసా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోనే పడుతోందని, ప్రజలు కూడా ఎవరూ వైసీపీ నాయకులెవరూ డబ్బులు తినలేదని ఒక్క మాట కూడా అనలేదన్నారు.
చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఉండి ఏపీ గురించి మాట్లాడతారని, ఏపీలో ఉండి హైదరాబాద్ గురించి మాట్లాడతారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోయినా చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోతారన్నారు. అవినీతి నిర్మూలన జరగాలంటే ముందుగా వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మార్పు తీసుకువచ్చే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications