టెట్‌ కేంద్రాల కేటాయింపుపై మంత్రి ఆగ్రహం...అవసరమైతే మళ్లీ వాయిదా

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపుల్లో పొరపాట్లపై విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.

  TDP Leaders Lashed Out At Jagan Over MP'S Resignation Issue

  ఒక జిల్లా నుంచి అభ్యర్థి దరఖాస్తు చేస్తే విద్యార్థికి ఆ జిల్లా కాకుండా మరో జిల్లాలోని మారు మూల ప్రాంతంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఏమిటని మంత్రి అధికారులను నిలదీశారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునేందుకు అంతర్ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించినప్పటికి...రాష్ట్రంలోనే సుదూర ప్రాంతాలకు వేసిన వారి గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అవసరమైతే టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేసే అంశం పరిశీలిస్తామన్నారు. టెట్‌ ఎగ్జామ్ నిర్వహణపై ఆయన గురువారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

  ఇంత టైమ్ దొరికినా...ఇన్ని పొరపాట్లా?...

  ఇంత టైమ్ దొరికినా...ఇన్ని పొరపాట్లా?...

  ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన టెట్ ఎగ్జామ్ కు సంబంధించి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున పొరపాట్లు చోటుచేసుకోవడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంత సమయం లభించినా అభ్యర్థులకు కనీసం వారి జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించలేకపోవడంపై మంత్రి అసంతృప్తి తెలియజేశారు.

  హాల్ టికెట్ల డౌన్ లోడ్...గురువారం వరకు సమయం

  హాల్ టికెట్ల డౌన్ లోడ్...గురువారం వరకు సమయం

  ధరఖాస్తుల్లో విద్యార్థులు ప్రత్యేకించి కోరుకోకపోయినా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో టెట్‌ కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు గురువారం వరకు సమయం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలు 183 ఉండగా అత్యధికంగా తూర్పుగోదావరి, గుంటూరుల్లో 24 ఎగ్జామ్ సెంటర్లు ఉండగా విశాఖపట్నంలో 17, కృష్ణాలో 22, చిత్తూరులో 15 ఏర్పాటు చేశారు. అయితే చాలా జిల్లాల్లో అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండగా...పరీక్షా కేంద్రాలు తక్కువే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 42,622 మంది అభ్యర్థులకు కేవలం 5 పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించిన అభ్యర్థులు కేంద్రాలను మార్చుకునేందుకు అవకాశం కల్పించిన అధికారులు...వీరికి మార్చి 2న ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం.

  గురువారం మరోసారి...ఉన్నత స్థాయి సమీక్ష

  గురువారం మరోసారి...ఉన్నత స్థాయి సమీక్ష

  టెట్‌ నిర్వహణలో అనేక లోపాలున్నట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్ననేపథ్యంలో గురువారం విద్యాశాఖ అధికారులతో నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. టెట్ నిర్వహణపై గురువారం అమరావతిలో విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్‌లతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో జరిగిన పొరపాట్ల గురించి ప్రస్తావిస్తూ టెట్ ఎగ్జామ్ కు 4.61 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆయా అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

  అవసరమైతే...వాయిదా?...

  అవసరమైతే...వాయిదా?...

  అయితే అభ్యర్థుల ఇబ్బందులను సకాలంలో నివారించేందుకు చర్యలు చేపడతామని...పరీక్షను వాయిదా వేసే ఆలోచన లేదని మంత్రి గంటా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించి అన్ని ఇబ్బందులు తొలగిపోయాయని ఈసందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమయాభావం, నిర్వహణ విషయంలో అభ్యర్థులకు ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటే...వాటిపై చర్చించి, తప్పనిసరి అయితే టెట్ పరీక్షను మరోసారి వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In the wake of the students' concern over the allocation of test centers alloted in long distances, AP EducationMinister Ganta Srinivasa Rao expressed serious concern.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి