రైతుల మహా పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత చంద్రబాబే, అది శ్రీమంతుల పాదయాత్ర: మంత్రి జయరాం సెన్సేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అధికార వైసిపి, టిడిపి నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. గత రెండున్నరేళ్లుగా నిత్యం ఏదో ఒక విషయంలో ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఒకవైపు అమరావతి రైతుల మహా పాదయాత్ర, మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం వెరసి పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. వైసిపి అరాచక పాలన సాగిస్తుందని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి నేతలు, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, జగన్ పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు విషం కక్కుతున్నారని వైసీపీ నేతలు తిట్టుకోవడం ఏపీలో పరిపాటిగా మారింది.

రైతుల మహా పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత చంద్రబాబే : మంత్రి గుమ్మనూరు జయరాం
ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ, టిడిపి నేతలపై విరుచుకు పడుతున్న వైసీపీ నేతలు ఒకపక్క ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని మండిపడుతున్నారు. మరోపక్క అమరావతి రైతులు సాగిస్తున్న మహాపాదయాత్ర, టీడీపీ మహా పాదయాత్ర అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత చంద్రబాబేనని గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు.

అన్యాయం టూ అన్యాయం మోసం టూ మోసం అనే టైటిల్ బాగుండేది
పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించిన ఆయన ప్రజలకు న్యాయం జరగాలంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టంచేశారు. న్యాయస్థానం టు దేవస్థానం అని పేరు పెట్టిన పాదయాత్రపై సెటైర్లు వేసిన గుమ్మనూరు జయరాం అన్యాయం టూ అన్యాయం మోసం టూ మోసం అనే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ అమరావతి ప్రాంత రైతుల మహా పాదయాత్రను ఎద్దేవా చేశారు.

అది శ్రీమంతుల పాదయాత్ర
రైతుల మహా పాదయాత్రకు ఎటువంటి ఆదరణ లేదని పేర్కొన్న ఆయన, ఇది అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర కాదని, శ్రీమంతుల పాదయాత్ర అని ధ్వజ మెత్తారు. చంద్రబాబు వెనకుండి మహా పాదయాత్రను ముందుకు నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు కక్ష ఉందని పేర్కొన్న గుమ్మనూరు జయరాం న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు న్యాయం చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు చేయిస్తున్న రైతుల పాదయాత్రకు ఆదరణ కరువైందని వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం. అందుకే ఏదో ఒక రచ్చ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి రైతుల పోరాటాన్ని ఆది నుండీ వ్యతిరేకిస్తున్న వైసీపీ
ఒకపక్క రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు పోరాటం చేస్తుంటే వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ రాజధాని రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. కానీ వైసిపి మాత్రం రాజధాని రైతుల పోరాటాన్ని పెయిడ్ ఆర్టిస్టుల పోరాటంగా, శ్రీమంతుల పోరాటంగా, చంద్రబాబు బినామీలు చేయిస్తున్న పోరాటంగా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగానే రైతులు చేస్తున్న మహాపాదయాత్రను సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications