పేలిన మరో కారు టైరు: మంత్రి కాల్వకు తృటిలో తప్పిన ప్రమాదం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కాల్వ శ్రీనివాసులుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇక్కడ ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
పక్కనే వెళ్తున్న మరో కారు టైరు పేలి మంత్రి కాన్వాయ్‌ను రాసుకుని వెళ్లింది. దీంతో మంత్రి వాహనం వెనుక భాగం బాగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాద సమయంలో కారులో కాల్వ శ్రీనివాసుతో పాటు జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు ఉన్నారు.

ప్రమాదం అనంతరం ఆ కారును అక్కడే వదిలి మరో వాహనంలో వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలియడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.












Click it and Unblock the Notifications